logo

ఖాతాదారుల ప్రమేయం లేకుండా నగదు మాయం

సైబర్‌ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారో తెలియక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా నగర శివారులోని ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్మును పోగొట్టుకున్నారు. వివరాలు.. ఎ.నారాయణపురం గ్రామా

Published : 30 Jun 2022 02:43 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారో తెలియక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా నగర శివారులోని ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్మును పోగొట్టుకున్నారు. వివరాలు.. ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ, చలపతిలకు చెందిన రూ.లక్ష ఏడు వేలను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. ఈ నెల 24న రాత్రి నుంచి ఖాతాల్లో డబ్బు డ్రా అవుతున్నట్లు వారి చరవాణులకు మెసేజ్‌లు వెళ్లాయి. పలు దఫాలుగా లక్ష్మీనారాయణకు చెందిన ఇండియన్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.70 వేలు, చలపతికి చెందిన కెనరా బ్యాంకు ఖాతాలో రూ.7 వేలు, అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాలో రూ.30 వేలు మాయమైంది. ఈ ఘటనతో ఆందోళన చెందిన బాధితులు ఆయా బ్యాంకుల్లో సంప్రదించారు. బ్యాంకు అధికారులతో సూచనతో బుధవారం సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని