logo

పింఛన్లు తొలగిస్తే ఎలా బతకాలి?

‘12 నెలల కిందట పింఛన్‌ నిలిపివేశారు. వందశాతం అంగవైక్యలం ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారో తెలియడం లేదు. పునరుద్ధరించాలని సచివాలయం, ఎంపీడీవో, ఆర్డీవో, కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు’

Updated : 09 Aug 2022 06:46 IST

కలెక్టరేట్‌కు వచ్చి వెళుతున్న సంజీవమ్మ

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ‘12 నెలల కిందట పింఛన్‌ నిలిపివేశారు. వందశాతం అంగవైక్యలం ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారో తెలియడం లేదు. పునరుద్ధరించాలని సచివాలయం, ఎంపీడీవో, ఆర్డీవో, కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు’ అని సోమందేపల్లి మండలం చాల్లపల్లికి చెందిన దివ్యాంగురాలు సంజీవమ్మ వాపోయారు. తన పింఛన్‌ (వితంతు) 13 నెలలు కిందట తొలగించారని, వందశాతం అంగవైకల్యం ఉన్న తన కుమారుడు బాలునాయక్‌ పింఛన్‌ కూడా తొలగించారని, తామెలా బతకాలని సాలీబాయి అనే మహిళ కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందనలో ప్రజలు నుంచి 259 అర్జీలు వచ్చాయి. కలెక్టర్‌ బసంత్‌కుమార్‌, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, ఆర్డీవో భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు.

శిక్షణ డిప్యూటీ కలెక్టర్లుగా మధులత, భవానీశంకర్‌

జిల్లాకు నూతనంగా ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు నియమితులయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో మధులత, భవానీశంకర్‌ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టారు. తర్వాత డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, ఆర్డీవో భాగ్యరేఖను కలిశారు. వీరు ఏడాది పాటు శ్రీసత్యసాయి జిల్లాలో శిక్షణ పొందనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని