logo

భక్త సంద్రమైన బత్తలపల్లి

వేలాదిమంది భక్తుల నడుమ వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పీర్లతో బత్తలపల్లి కూడలి మంగళవారం కిటకిటలాడింది. గ్రామంలోని చిన్న, పెద్ద ఖాశీంస్వాముల పీర్లు భేటీ అయ్యాయి. బత్తలపల్లి కూడలి, వెంకటగారిపల్లి సత్రం వద్ద ఈ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి.

Published : 10 Aug 2022 05:10 IST

వివిధ గ్రామాల నుంచి వచ్చిన పీర్లతో భేటీ అవుతున్న ఖాశీంస్వామి

బత్తలపల్లి న్యూస్‌టుడే: వేలాదిమంది భక్తుల నడుమ వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పీర్లతో బత్తలపల్లి కూడలి మంగళవారం కిటకిటలాడింది. గ్రామంలోని చిన్న, పెద్ద ఖాశీంస్వాముల పీర్లు భేటీ అయ్యాయి. బత్తలపల్లి కూడలి, వెంకటగారిపల్లి సత్రం వద్ద ఈ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. ఉదయం గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి, ముష్టూరు, రాఘవంపల్లి గ్రామాల నుంచి వచ్చిన పీర్లు బత్తలపల్లి కూడలిలో స్థానిక చిన్న, పెద్ద ఖాశీంస్వాములు మరికొన్ని పీర్లతో కలిశాయి. సాయంత్రం పీర్లు ఎత్తుకొని భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం గ్రామ శివార్లకు తీసుకువెళ్లి జలధి కార్యక్రమం నిర్వహించారు.  సీఐ మన్సూరుద్దీన్‌, ఎస్సై శ్రీహర్ష బందోబస్తు ఏర్పాటు చేశారు.

గూగూడులో అగ్నిగుండంలోకి ప్రవేశిస్తున్న కుళ్లాయిస్వామి

కుళ్లాయిస్వామి.. చల్లగా చూడయ్యా!

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: గూగూడు కుళ్లాయిస్వామి జలధి కార్యక్రమం మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. 11 రోజుల పాటు పీర్ల మకానంలో దర్శనమిచ్చిన కుళ్లాయిస్వామి జలధికి వెళ్లారు. కుళ్లాయిస్వామితో పాటు కొలువుదీరిన 21 పీర్లకు ప్రత్యేక పుష్పాలు, బంగారు, వెండి గొడుగులు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. తెల్లవారుజామున గూగూడు ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. స్వామి అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండన్న వంశీయులు పీర్లతో అగ్నిగుండం ప్రవేశం చేయించి, మేళతాళాల నడుమ కొర్లగుట్ట మీదుగా జలధికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని