logo

వేడుకల్లో భాగస్వాములవుదాం

భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సిరసాని హిల్స్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మైదానంలో ముందస్తు సన్నాహక సాధనలో భాగంగా పోలీసు కవాతు, బందోబస్తు, ఇతరత్రా

Published : 15 Aug 2022 05:22 IST

పరేడ్‌ గ్రౌండ్‌లో సన్నాహక సాధన పరిశీలిస్తున్న  కలెక్టర్‌ బసంత్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌

పుట్టపర్తి, పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సిరసాని హిల్స్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మైదానంలో ముందస్తు సన్నాహక సాధనలో భాగంగా పోలీసు కవాతు, బందోబస్తు, ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం సన్నాహక సన్నద్ధతలో భాగంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ నేతృత్వంలో సాయుధ పోలీసుల బలగాల వందనం, పోలీసు జాగిలాల ప్రదర్శన, డాగ్‌ స్క్వాడ్‌ సలామిని పర్యవేక్షించారు. కలెక్టర్‌ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్‌, పీడీ నర్సయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దార్‌ భాస్కరనారాయణ తదితరులు ఉన్నారు.

నేటి కార్యక్రమాలు ఇలా..

పుట్టపర్తి, పుట్టపర్తి గ్రామీణం: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు తొలిసారిగా సోమవారం సిరసాని కొండ ప్రాంతంలో ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ చేయనున్నారు. సోమవారం వేడుకల వివరాలను జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

* ఉదయం: 8.30 గంటలకు పరేడ్‌ గ్రౌండుకు చేరుకోవడం, 8.40కి పరేడ్‌ గ్రౌండ్‌ను కమాండర్‌ బాధ్యతలు తీసుకోవడం, 8.55 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లోకి జిల్లా ఎస్పీ ఆగమనం, 8.57కు జిల్లా కలెక్టర్‌ ఆగమనం, 9.05కు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆగమనం, పతాక ఆవిష్కరణ, పోలీసు దళం గౌరవ వందన స్వీకరణ, 9.15కు మంత్రి సందేశం 9.35కు సాయుధ దళాల మార్చ్‌ఫాస్ట్‌, 9.55కు అభివృద్ధిపై ఆయా ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, 10.05కు బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు, 10.45కు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డుల ప్రదానం, 11.15కు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు, ఆహ్వానితులను కలిసి అభినందనలు తెలపటం11.20 గంటలకు ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శనతో కార్యక్రమాలు ముగుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని