logo

సమస్యలు గడువులోపు పరిష్కరించండి

స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా గడువులోగా పరిష్కారం చూపించాలని జేసీ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 36 అర్జీలు అందాయి.

Published : 17 Aug 2022 03:54 IST

ఫిర్యాదు పరిశీలిస్తున్న జేసీ చేతన్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే: స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా గడువులోగా పరిష్కారం చూపించాలని జేసీ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 36 అర్జీలు అందాయి. జేసీతోపాటు డీఆర్వో కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, వివిధశాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. పుట్టపర్తి పట్టణంలోని కుమ్మరపేటకులో డోర్‌ నెంబర్‌ 3-179లో నివాసం ఉంటున్నానని, రేషన్‌కార్డు మంజూరు చేయాలని రామకృష్ణ కోరారు. గోరంట్ల మండలం బూదిలి సర్వే నెంబర్‌ 125లో 14.07 ఎకరాల భూమి ఉందని, ఇందులో 1.57 భూమి వివాదాస్పదంగా ఉందని, సర్వే చేసి సరిహద్దులు ఏర్పాటు చేయించాలని హిందూపురం  పట్టణానికి చెందిన షేక్‌కళా, ఫకృద్దీన్‌ వినతి పత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని