logo

చిరు అభిమానుల భారీ ఆటో ర్యాలీ

గాడ్‌ ఫాదర్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా అనంతపురంలో మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఆయన ఫ్లెక్సీలతో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది.

Published : 27 Sep 2022 03:08 IST


ఆటో ర్యాలీని ప్రారంభిస్తున్న అభిమాని భవాని రవికుమార్‌

గుల్జార్‌పేట: గాడ్‌ ఫాదర్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా అనంతపురంలో మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఆయన ఫ్లెక్సీలతో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఇందులో భాగంగా సోమవారం 500 ఆటోలతో గాడ్‌ఫాదర్‌ చిత్ర పోస్టర్లను ఏర్పాటు చేసుకొని ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర చిరంజీవి యువత భవాని రవికుమార్‌ ఆర్ట్స్‌ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. 20 వేల మందికి ఉచితంగా పాసులు ఇవ్వడానికి సిద్ధం చేశామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా డీ అండ్‌ బీ సౌండ్‌ సిస్టమ్‌ను ఈ ఈవెంట్‌కు ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభిమానులు చలపతి, చంద్రమౌళి, శ్రీనివాసులు, షామీర్‌, హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని