logo

కనుల పండువగా తెప్పోత్సవం

దసరా పర్వదినం సందర్భంగా బుక్కరాయసముద్రం చిక్కవడియార్‌ చెరువులో బుధవారం కొండమీద వెంకట రమణస్వామి తెప్పోత్సవం మత్స్యకార సంఘం అధ్యక్షుడు నగేష్‌ ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు.

Published : 07 Oct 2022 04:42 IST

చిక్కవడియార్‌ చెరువులో తెప్పపై విహరిస్తున్న కొండమీదరాయుడు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: దసరా పర్వదినం సందర్భంగా బుక్కరాయసముద్రం చిక్కవడియార్‌ చెరువులో బుధవారం కొండమీద వెంకట రమణస్వామి తెప్పోత్సవం మత్స్యకార సంఘం అధ్యక్షుడు నగేష్‌ ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. గ్రామంలోని వేంకటరమణస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్థులు స్వామిని సతీసమేతంగా గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం చెరువుకట్టపై గంగమ్మ దేవాలయం దగ్గర నుంచి చెరువులో ఏర్పాటుచేసిన తెప్పపై ఊరేగించారు. దీన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వెంకటరమణ స్వామి గోవిందా... అంటూ భక్తులు స్వామి నామాన్ని జపించారు. గ్రామంలో ముసలమ్మతల్లి ఆలయంలో కూడా అర్చకులు విశేష పూజలు చేశారు. ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సభ్యుడు భాస్కర్‌, సర్పంచి పార్వతి, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని