logo

పేదరికాన్ని జయించిన సంకల్పం

సంఘటితగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు పుట్టపర్తికి చెందిన కొందరు మహిళలు.  

Published : 30 Nov 2022 05:52 IST

పొదుపుతో మహిళల జీవితాల్లో వెలుగులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సంఘటితగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు పుట్టపర్తికి చెందిన కొందరు మహిళలు.  పేదరికాన్ని జయించాలన్న వారి దృఢ సంకల్పం.. మెప్మా అధికారుల ప్రోత్సాహం.. లక్ష్య సాధనకు దోహదం చేశాయి. ఒకప్పుడు వడ్డీవ్యాపారులతో ఇబ్బందులుపడినవారే.. ఇప్పుడు ఇతరులకు రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. పుట్టపర్తి మెప్మా పరిధిలో 648 సంఘాల్లో 6,442 మంది సభ్యులు రూ.85 కోట్లపైగా రుణాలు తీసుకున్నారు. 2022-23 సంవత్సరానికి రూ.8.75 కోట్ల రుణాలు అందుకున్నారు. మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని.. ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తున్నారు.


కుట్టుతో ఉత్తమ భవిష్యత్తు

టైలరింగ్‌లో పదిమందికి ఉపాధి కల్పిస్తూ జీవనోపాధి పొందుతున్నాను. బ్యాంకు నుంచి పదిమంది సభ్యులం కలిసి రూ.10 లక్షలు తీసుకున్నాం. టైలరింగ్‌, డిజైనింగ్‌ చేయడం.. చీరలు విక్రయించడం ద్వారా నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాను. భర్తకు తోడుగా నావంతు కుటుంబషోషణకు ఆర్థిక చేయూత అందిస్తున్నాను. పిల్లల చదువులు, కుటుంబానికి ఎలాంటి ఢోకా లేదు. పొదుపు మా జీవితాలను మార్చేసింది.

సుజాత, ప్రశాంతిగ్రామ్‌


రోజూ వెయ్యి రూపాయల వ్యాపారం

గతంలో జీవనోపాధి కోసం కష్టపడ్డాం. ప్రస్తుతం మెప్మా సహకారంతో రూ.లక్ష రుణం తీసుకున్నాను. కర్ణాటకలోని బాగేపల్లి మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నాను. రోజూ రూ.1000 నుంచి రూ.1500 వరకు వ్యాపారం అవుతోంది. రోజూ రూ.400 వరకు ఆదాయం ఉంటుంది. ఇంట్లో కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. భర్తకు తోడుగా మా పిల్లలను చదివించుకుంటున్నాం.

వెంకటరమణమ్మ, పుట్టపర్తి


ఫొటో ల్యామినేషన్‌తో ఉపాధి  

పదిమంది సభ్యులతో కలిసి పొదుపు సంఘం పేరుతో రూ.10 లక్షలు రుణం తీసుకున్నాం. నావంతు రూ.లక్ష రుణం తీసుకున్నా. సత్యసాయి చిత్రపటాలను ల్యామినేషన్స్‌ తయారీని ప్రారంభించా. నెలకు రూ.30 వేలు వ్యాపారం జరుగుతోంది. రూ.10 వేలకుపైగా ఆదాయం వస్తోంది. ఎవరికైనా సంఘంలో సభ్యులకు కష్టమొచ్చినా ఒక రూపాయి వడ్డీకి రుణం ఇస్తున్నాను. నెలకు రుణం చెల్లిస్తూనే కొంత పొదుపు చేస్తున్నాను.

లక్ష్మి, చిత్రావతిరోడ్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని