ఎస్‌ఆర్‌ఐటీపై కన్నెత్తి చూడని అధికారులు
ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల విద్యాశాఖ సలహాదారుడిది కావడం వల్లే జిల్లా అధికారులు కన్నెత్ని చూడటం లేదని జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
విద్యార్థుల సంఘాల ఆందోళన
నగరంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు
ఆజాద్‌నగర్, న్యూస్‌టుడే: ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల విద్యాశాఖ సలహాదారుడిది కావడం వల్లే జిల్లా అధికారులు కన్నెత్ని చూడటం లేదని జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎ, ఏఐఎస్బీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు గురువారం స్థానిక జడ్పీ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట అర్ధనగ్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 86 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనా యాజమాన్యం, అధికారులు విషయం రహస్యంగా ఉంచారన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించలేదన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన భోజనం, వసతులు కల్పించకుండా రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో ఇలా జరగడం రెండోసారి అన్నారు. సదరు కళాశాల శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, విద్యాశాఖ సలహాదారు సాంబశివారెడ్డికి చెందినది కావడం వల్లే చర్యలకు వెనుకాడుతున్నారని దుయ్యబట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కుళ్లాయిస్వామి, పృథ్వీ, అబ్దుల్ ఆలం, చంద్ర, ఉమా మహేష్, వంశీ, ఆనంద్, మంజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్