logo

నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

నాడు-నేడు పనులల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ డీఈవో సాయిరాం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 04 Jun 2023 06:33 IST

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: నాడు-నేడు పనులల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ డీఈవో సాయిరాం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గార్లదిన్నె మండలం పెనకచర్ల ఎంపీపీఎస్‌ ప్రధాన పాఠశాలలో ఎస్‌జీటీ లక్ష్మిదేవి, పామిడి మండలం ఓబుళాపురం గ్రామ ఎంపీపీపీఎస్‌ ఉపాధ్యాయురాలు రోజామేరీ, గుత్తిలోని 9వ వార్డు ఎంపీపీఎస్‌ హెచ్‌ఎం కంబగిరి రాముడు, గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న ఎంపీపీఎస్‌ ఎస్‌జీటీ నూరున్నిషాలను సస్పెండ్‌ చేశారు. నాడు-నేడు రెండో విడత పనులకు నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వవహించినందుకు సస్పెండ్‌ చేసినట్లు డీఈవో తెలిపారు.


సజావుగా గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఏపీ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు ప్రారంభయ్యాయి. తొలిరోజు శనివారం ఏ సమస్య, ఘటన చోటు చేసుకోలేదు. ఈ పరీక్షలు ఈ నెల పదో తేదీ దాకా జరగనున్న సంగతి తెలిసిందే. అనంత జేఎన్‌టీయూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆఫ్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 522 మందికిగాను 402 మంది హాజరయ్యారు. 120 మంది గైర్హాజరయ్యారు. ఆదివారం (4న) మినహా.. తక్కిన అన్ని రోజులు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పరీక్షలు జరుగుతాయి. ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వహణ తీరును కలెక్టర్‌ గౌతమి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని