logo

అనంత నగరపాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ

అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్‌లతో సినిమా తీశారు.

Published : 28 Mar 2024 04:50 IST

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్‌లతో సినిమా తీశారు. ఆవరణలోనే సెట్టింగ్‌లు వేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో సినిమా తీయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఏ సినిమా అన్నది గోప్యంగా ఉంచారు. తమిళ సినిమాకు సంబంధించిన అనువాద సినిమా అని చెబుతున్నారు.

ఎమ్మార్వో కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలపై చిత్రీకరణ సాగుతోంది. కార్యాలయంలో కూడా కొన్ని అంశాలు చిత్రీకరణ చేశారు. గత కమిషనర్‌ భాగ్యలక్ష్మి హయాంలో చిత్రీకరణ చేయాలని నిర్ణయించి అప్పట్లో అధికార పార్టీ నేతలతో ఒత్తిడి చేయించారు. ఆమె అందుకు అంగీకరించలేదు. తాజాగా ఎలా అనుమతి ఇచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. నగరపాలక కమిషనర్‌ మేఘస్వరూప్‌ను వివరణ కోరగా ఎన్నికల కోడ్‌కంటే ముందుగానే అనుమతి తీసుకున్నారని, తాజాగా సినిమా చిత్రీకరణ చేస్తున్నారన్నారు. నగరపాలక వాహనాలు వాడుకోకూడదని, వాడుకొని ఉంటే చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని