logo

మంచినీరు వృథా.. వ్యధ..

ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు  కష్టాలు ఎదుర్కొంటున్నారు.

Published : 28 Mar 2024 04:56 IST

 న్యూస్‌టుడే, ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు  కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయం వెనుక నివాస గృహాల మధ్య ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రధాన పైపులైన్‌ బుధవారం మధ్యాహ్నం పగిలిపోవడంతో తాగునీరు వృథాగా పోయింది. ఇళ్ల మధ్య వీధుల్లో ఆ నీరు పారడం వల్ల స్థానికులు ఇబ్బంది పడ్డారు. నిర్వహణ లోపంతో తరచూ పైపు లైన్‌ పగులుతోంది.

పట్టణంలో చాలా వీధుల్లో తాగునీరు పది రోజులకు ఒకసారి కూడా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులుగా తమ కుళాయిలకు తాగునీరు రావడంలేదని స్థానిక పాతపేట ఎనిమిదో వార్డు మారెమ్మ ఆలయ వీధికి చెందిన మహిళలు వాపోయారు. వారు బుధవారం తమ వీధిలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు రాత పూర్వకంగా పలు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని