logo

పోలింగ్‌ కేంద్రం పక్కనే కోడ్‌ ఉల్లంఘన

అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్‌ కేంద్రం పక్కనే కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు.

Published : 28 Mar 2024 05:03 IST

న్యూస్‌టుడే, అనంత నగరపాలక: అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్‌ కేంద్రం పక్కనే కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. అనంతపురం నియోజకవర్గంలోని రాజీవ్‌కాలనీ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 23వ నంబరు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కనిపించే విధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిలువెత్తు చిత్రాలతో పాటు ఎంపీ తలారి రంగయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ చిత్రాలున్న శిలాఫలకం, వైకాపా రంగులు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎవ్వరికీ పట్టడం లేదు. పైగా ఎదురుగానే సచివాలయం ఉన్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఎన్నికల నియామావళి అమల్లోకి వచ్చి 12 రోజులవుతున్నా శిలాఫలకాన్ని పట్టించుకోకపోవడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని