logo

నేడు కణేకల్లులో చంద్రబాబు సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు.

Published : 19 Apr 2024 03:46 IST

అనంతపురం(వ్యవసాయం): ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఆలూరు అగ్రహారం కొండవద్ద హెలీకాప్టర్‌లో బయలుదేరి 5.10 గంటలకు కణేకల్లు క్రాస్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5.25 గంటలకు కణేకల్లు బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుంటారు. 6.00-7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 7.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, శ్రీవిద్యానికేతన్‌ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారని తెదేపా వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని