logo

కొండను తవ్వి.. వంకలు పూడ్చి

వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్‌ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు.

Published : 24 Apr 2024 04:58 IST

వైకాపా నాయకుల అండతో నిబంధనల అతిక్రమణ

కొండను కొల్లగొట్టారు ఇలా...

కనగానపల్లి, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్‌ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. కొన్న భూముల్లో వంకలు, గుట్టలు ఉన్నాయి. ఆ పొలానికి ఆనుకొని కొండలో ఉన్న మట్టిని తవ్వి వంకలను పూడ్చుకోవచ్చని భావించి 148 ఎకరాల్లో ఉన్న కడుపునొప్పి కొండపై కన్నేశాడు. యంత్రాలతో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించి వంకలను, వాగులకు మట్టితో కప్పేశాడు. కొండ ప్రాంతం సర్వే నంబరు 31లో 54.25 ఎకరాలు, 32లో 15.19 ఎకరాలు, 33లో 75.33 ఎకరాలు, 34లో 3.99 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 15 ఎకరాలకు పైగానే మండలంలోని ముఖ్య వైకాపా నాయకుల అండతో కొండను తవ్వేశాడు. వంకలు, వాగులను పూడ్చి పొలానికి సమాంతరంగా ఉండేలా నేలను తయారు చేశాడు. కొండపై కురిసిన వర్షపు నీరు వంకల వెంబడి చెరువుల్లోకి నీరు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని