logo

దేవుడి భూమినీ గుల్ల చేశారు

జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది.

Published : 24 Apr 2024 05:17 IST

21 ఎకరాలకు మిగిలింది రెండె

నెలగొండరాయుడుస్వామి ఆలయ భూమిలో ఇష్టారాజ్యంగా చేసిన తవ్వకాలు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే : జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన కొందరు ఇష్టారాజ్యంగా ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. గడచిన ఐదేళ్లలో సాగులో ఉన్న ఆలయ భూమిలో ప్రవేశించి అక్రమార్జనకు తెరలేపారు. ప్రస్తుతం ఆలయ భూమి ఆనవాలు లేకుండా చేశారు. మాన్యం ఆనవాళ్లు కోల్పోవడంతో ఆలయ అధికారులు కౌలుమాటే మరిచిపోయారు. ఎర్రమట్టి తవ్వకాలతో భూమి రూపు కోల్పోయి 21 ఎకరాల్లో రెండు ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈవిషయంపై దేవదాయశాఖ ఈవో నాగేంద్రుడును వివరణ కోరగా ఆలయ భూమిలో భారీగా అక్రమ తవ్వకాలు జరిపారు. ఇదివరకే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని