logo

ప్రపంచానికి గోవు ప్రాధాన్యం తెలియజేయాలి

గోవుప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తితిదే పాలక మండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ గోసంరక్షణశాలలో ఆదివారం కనుమ పండుగ నేపథ్యంలో గోమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన

Published : 17 Jan 2022 03:13 IST


గోవుకు దాణా తినిపిస్తున్న గోపీనాథ్‌జెట్టి. చిత్రంలో పోకల అశోక్‌కుమార్‌, డాక్టర్‌ కె.హరినాథరెడ్డి తదితరులు

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: గోవుప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తితిదే పాలక మండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ గోసంరక్షణశాలలో ఆదివారం కనుమ పండుగ నేపథ్యంలో గోమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను యువత భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు. గోఆధారిత వ్యవసాయంతో భూమాత, గోమాత, సమాజం సురక్షితంగా ఉంటాయని చెప్పారు. ప్రకృతిలోని వ్యత్యాసాన్ని గోవుద్వారా సరిచేయవచ్చన్నారు. అంతకుముందు వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్వీ గో సంరక్షణశాల సంచాలకులు డాక్టర్‌ కె.హరినాథరెడ్డి, మేనేజర్‌ డాక్టర్‌నాగరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని