logo

సీఎంసీలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి

మండలంలోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు వర్తింపజేయాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు నాగరాజు మాట్లాడుతూ

Published : 18 Jan 2022 04:52 IST

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

గుడిపాల: మండలంలోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు వర్తింపజేయాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు నాగరాజు మాట్లాడుతూ ఈ విషయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోవాలన్నారు. ఎంతోమంది పేదలు ఈ ఆస్పత్రికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం నిత్యం వస్తుంటారన్నారు. అనంతరం తహసీల్దార్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సీపీఐ కౌన్సిల్‌ సభ్యుడు కె.మణి, చిత్తూరు నగర కార్యదర్శి సి.గోపీనాథ్‌, పూతలపట్టు నియోజకవర్గ నాయకులు సురేంద్రనాథ్‌, విజయకుమార్‌, చంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని