logo

577 పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ

జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా జిల్లాలోని 577 పంచాయతీల్లో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్టును తయారుచేస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్‌

Published : 27 May 2022 05:43 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌ 

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా జిల్లాలోని 577 పంచాయతీల్లో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్టును తయారుచేస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్‌.. గురువారం జిల్లా అధికారులతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సంపద కేంద్రాల్లో ప్రస్తుతం 20 టన్నుల వర్మీ కంపోస్ట్‌ అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు 30 టన్నులు విక్రయించగా రూ.2.17 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. జిల్లాకు మంజూరైన 516 సామూహిక మరుగుదొడ్లకుగానూ 63 పూర్తయ్యాయన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా పూతలపట్టు, పులిచెర్ల మండలాలకు శుద్ధజల ప్లాంట్లు మంజూరు చేశామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 9 లక్షల పనిదినాల్ని కల్పించామని, సప్లై ఛానల్, ఫీడర్‌ ఛానల్‌ పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, డ్వామా పీడీ చంద్రశేఖర్, డీపీవో దశరథరామిరెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 
సమగ్ర భూసర్వేపై సమీక్ష.. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌ గురువారం కలెక్టర్‌ హరినారాయణన్, జేసీ వెంకటేశ్వర్‌తో సమీక్షించారు. భూరికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వేతోపాటు భూపరిపాలన సంబంధ అంశాలపై సమీక్ష జరిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని