logo

ఆర్‌బీకేల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ

జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ను శనివారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేశారు. ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ఆర్‌బీకేలను తనిఖీలు చేశారు.

Published : 25 Sep 2022 02:31 IST

గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లె ఆర్‌బీకేను తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ను శనివారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేశారు. ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ఆర్‌బీకేలను తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని నగరి, ఎస్‌ఆర్‌పురం, గంగాధరనెల్లూరు మండలాల్లోని పలు ఆర్‌బీకేలను తనిఖీ చేసి రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పంపిణీ తీరు, ఈ-పంట నమోదు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల సహాయకుల పనితీరుపై ఆరా తీశారు. ఆర్‌బీకే పనితీరుపై ప్రభుత్వానికి నివేదిస్తామని విజిలెన్స్‌ సీఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.హెచ్‌సీ జయరామిరెడ్డి, విజిలెన్స్‌, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని