logo

‘హాకీ ఆంధ్రప్రదేశ్‌ అసోసియేషన్‌ గుర్తింపు రద్దు చేయండి’

అక్రమాలకు పాల్పడుతూ, క్రీడాకారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న హాకీ ఆంధ్రప్రదేశ్‌ అసోసియేషన్‌ గుర్తింపును ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలని జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంవీఎస్‌ మణి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 29 Jan 2023 04:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎంవీఎస్‌ మణి

చంద్రగిరి, న్యూస్‌టుడే: అక్రమాలకు పాల్పడుతూ, క్రీడాకారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న హాకీ ఆంధ్రప్రదేశ్‌ అసోసియేషన్‌ గుర్తింపును ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలని జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంవీఎస్‌ మణి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని మిట్టపాళ్యంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. జాతీయ హాకీ క్రీడను మరింత ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొన్ని నకిలీ సంఘాలు ఏర్పడి హాకీ క్రీడాకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై స్పోర్ట్స్‌ అథారిటి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. హాకీ ఆంధ్రప్రదేశ్‌ అసోసియేషన్‌ సంస్థ పలు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2011లో రిజిస్ట్రేషన్‌ చేయించారని, అందులో ఒక విధంగా బ్యాంకు ఖాతాలో మరో పేరుతో ఖాతాలు తెరచి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. 2016లో శాఖ సుమారు ఆరు లక్షలను మంజూరు చేస్తే వాటిని క్రీడాకారులకు ఉపయోగించకుండా దుర్వినియోగం చేశారన్నారు. క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పాలిటెక్నిక్‌ ఇలా అనేక ప్రవేశాలకు ఆ సర్టిఫికెట్లను నివేదించిన సమయంలో అవి నకిలీవిగా శాప్‌ గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షులు గోపి, కార్యదర్శి పాదిరి ధనంజయరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని