logo

సర్వదర్శనానికి 14 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి సోమవారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

Published : 21 Mar 2023 02:50 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి సోమవారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 14 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. ఆదివారం శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.20 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ః శ్రీవారి ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని