logo

స్పందన అర్జీలు వెంటనే పరిష్కరించాలి

ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని జేసీ వెంకటేశ్వర్‌ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

Published : 21 Mar 2023 04:10 IST

అర్జీదారుతో మాట్లాడుతున్న జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు కలెక్టరేట్‌: ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని జేసీ వెంకటేశ్వర్‌ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో 324 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ సమస్యలు 189, పోలీసుశాఖ 4, గృహ నిర్మాణం 13, విద్యాశాఖ 3,  గనుల శాఖ 1, గురుకుల పాఠశాల 1, ఎక్సైజ్‌ శాఖ 1, డ్వామా 2, జడ్పీ 2, కార్మిక శాఖ 1, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ 1, పౌరసరఫరాల శాఖ 1, జలవనరుల శాఖ 3, జిల్లా పంచాయతీ 2, సైనిక సంక్షేమం 1, పురపాలక 3, ఎల్‌డీఎం 1, ఇతర సమస్యలపై 10, రేషన్‌కార్డులు, పింఛన్లకు సంబంధించి 85 అర్జీలు అందాయి. డీఆర్‌వో రాజశేఖర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని