logo

న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు

చిట్‌ సంస్థ ఏజెంటునని చెప్పి ఓ మహిళ తన వద్ద డబ్బులు కట్టించుకుని మోసం చేసినట్లు బైరెడ్డిపల్లెకు చెందిన రమణప్ప మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Published : 22 Mar 2023 03:12 IST

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: చిట్‌ సంస్థ ఏజెంటునని చెప్పి ఓ మహిళ తన వద్ద డబ్బులు కట్టించుకుని మోసం చేసినట్లు బైరెడ్డిపల్లెకు చెందిన రమణప్ప మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొత్తయిండ్లు గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న తిప్పక్క ఓ చిట్‌ సంస్థలో ప్రతి నెల రూ.1,000 పెట్టుబడి పెడితే 25 నెలల తర్వాత రూ.50,000 నగదు గానీ, ఓ గేదె ఇస్తామని చెప్పి తన భార్య నాగరత్నమ్మ పేరు మీద డబ్బు కట్టించుకుందన్నారు. 25 నెలలు క్రమం తప్పకుండా రూ.1000 చొప్పున 25,000 చెల్లించినట్లు చెప్పారు. నిర్ణీత గడువు ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నా ఎలాంటి నగదు గానీ, గేదె ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయమై మంగళవారం ఆమెను ప్రశ్నిస్తే తన భార్యపై దాడి చేసిందన్నారు. చిట్‌ సంస్థలో చెల్లించిన డబ్బు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు మొరపెట్టుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని