logo

నేటి నుంచి సూర్యపూజ మహోత్సవాలు

నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక సూర్యపూజ మహోత్సవాలు ప్రారం భం కానున్నాయి.

Published : 24 Mar 2023 02:09 IST

నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక సూర్యపూజ మహోత్సవాలు ప్రారం భం కానున్నాయి. అయిదు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో సూర్యకిరణాలు స్వామి మూలవిగ్రహాన్ని స్పృశించనున్నాయి. ఈ ఉత్సవాలతో పాటు శుక్రవారం మత్స్యజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారి మార్గమధ్యలోని నాగలాపురం గ్రామంలో జరిగే వేడుకలకు జిల్లాతో పాటు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో తితిదే ప్రత్యేక క్యూలైన్లు, గ్రామ కూడళ్లలో చలువపందిళ్లను తితిదే ఏర్పాటు చేయించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిత్యం తెప్పోత్సవాల నిర్వహణకు పుష్కరణి, తెప్పలు సిద్ధం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని