logo

టౌన్‌బ్యాంకు అభివృద్ధికి చర్యలు

చిత్తూరు కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు అభివృద్ధికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గిరింపేట టౌన్‌బ్యాంకు శాఖలో ఆదివారం జరిగిన బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 27 Mar 2023 03:25 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు

చిత్తూరు నగరం: చిత్తూరు కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు అభివృద్ధికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గిరింపేట టౌన్‌బ్యాంకు శాఖలో ఆదివారం జరిగిన బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర కలిగిన టౌన్‌ బ్యాంకును ఖాతాదారులే రక్షించుకున్నారని గుర్తుచేశారు. బ్యాంకు ఛైర్మన్‌ రామగణేష్‌ మాట్లాడుతూ టౌన్‌ బ్యాంకు ద్వారా రూ.14కోట్ల డిపాజిట్లు ఇప్పటివరకు సేకరించామన్నారు. త్వరలో టౌన్‌బ్యాంకు ద్వారా ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు సీబీఎస్‌ కోసం జేజేఐటీ కంపెనీ సమన్వయానికి కృషి చేసిన విశ్రాంత బ్యాంకు అధికారి అశోక్‌కుమార్‌ను ఎమ్మెల్యే సత్కరించారు. బ్యాంకు సీఈవో శ్రీనివాసన్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని