logo

చేనేత.. చేయూత

తరతరాలుగా శ్రీకాళహస్తిలో చేనేత వృత్తి ద్వారా ఉపాధిని పొందుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ వృత్తిని నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కల్పిస్తూ,

Published : 30 May 2023 02:30 IST

సాంకేతికతతో వ్యాపార విస్తరణ

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి : తరతరాలుగా శ్రీకాళహస్తిలో చేనేత వృత్తి ద్వారా ఉపాధిని పొందుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ వృత్తిని నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, మరో వైపు వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాళహస్తిలోని పద్మశాలిపేట, గజేంద్రనగర్‌, భాస్కరపేట, కొత్తపేట, బహుదూరుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 1500 కుటుంబాలకు పైగా ఈ వృత్తి ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు.కరోనాకు ముందు చేనేత వస్త్రోత్పత్తులను దుకాణాల్లో ఉంచి విక్రయించుకోవాల్సి వచ్చేది. మూడేళ్ల కిందట చేనేత రంగం కాస్తంత కుదేలైనా మళ్లీ పుంజుకుంది. ప్రధానంగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పలువురు మహిళలు ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారు.


ప్రభుత్వ ప్రోత్సాహం పెరగాలి

చేనేతల పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం మరింతగా పెరగాలి. ఈ వృత్తి ద్వారా ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అందులోనూ ఎక్కువ మంది పేదలే. వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం  అవసరం.

భారతి, పద్మశాలిపేట


8ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌తో..

వస్త్ర ప్రపంచంలో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో విధంగా ఉంటుంది. వాళ్లకు నచ్చిన రీతిలో తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు అలవాటు పడుతున్నారు. కరోనా ముందుతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాల వ్యాపారం పుంజుకుంది. దుకాణానికి వచ్చి కొనుగోలు చేసే వాళ్లతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

రుక్మిణి, పద్మశాలిపేట


8భయం పోయింది

కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం విలవిలలాడింది. ఆ పరిస్థితుల్లో ఆదరణ పూర్తిగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగుతుందని భయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సాంకేతికత విస్తరిస్తుండటంవల్ల మళ్లీ వ్యాపారం పుంజుకుంటోంది.

సుమతి, భాస్కరపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని