logo

ఈ రంగులు మారవా.. సార్‌..!

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం

Published : 28 Mar 2024 03:12 IST

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం. చిత్తూరు-పుత్తూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న వేల్కూరు రైతు భరోసా కేంద్రం నేటికీ వైకాపా రంగుల్లోనే ఉంది. అసలు దీనివైపు కన్నెత్తి చూసిన నాథుడే లేడు. ఒకప్పుడు ఎన్నికల కోడ్‌ ప్రకటించగానే నానా హడావుడి చేసి ఉరుకులు పరుగులు పెట్టే యంత్రాంగం.. ఈ విడత ఎన్నికల్లో ఇలాంటి చర్యలతో.. ఇలా కొందరు అధికారుల వ్యవహార శైలితో అభాసుపాలవుతోంది.

-న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని