logo

ఐదు నామినేషన్లు తిరస్కరణ

తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు.

Published : 26 Apr 2024 16:16 IST

మదనపల్లి గ్రామీణం: తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. ఈమె స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ అలానే ఉంది.. వైకాపా తరఫున నామినేషన్ వేసిన నిసార్ అహ్మమద్ తనయుడు మహమ్మద్ హసన్, కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మల్లెల పవన్ కుమార్ తమ్ముడు నరేంద్ర బీఫామ్ సమర్పించని కారణంగా ఆర్వో హరిప్రసాద్ నామినేషన్లను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆకాష్ వయసు 24 సంవత్సరాలు. నామినేషన్ అర్హత 25 సంవత్సరాలు కావడంతో అనర్హత కింద అతని నామినేషన్‌ను తిరస్కరించారు. ఓబిగాని రెడ్డప్ప దాఖలు చేసిన నామినేషన్‌లో ప్రతిపాదకుల వివరాలు తప్పుగా నమోదు చేయడంతో నామినేషన్ను తిరస్కరించినట్లు ఆర్వో హరిప్రసాద్ తెలిపారు. ప్రధాన అభ్యర్థులైన తెదేపా అభ్యర్థి షాజహాబాషా, వైకాపా అభ్యర్థి నిసార్ అహమ్మద్, కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి నామినేషన్లు ఆమోదించబడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని