logo

విద్యార్థి మృతిపై ఆందోళన

ధవళేశ్వరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(15) మంగళవారం రాత్రి పేలుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యమే కారణమని బాలి

Published : 21 Jan 2022 04:42 IST

హాస్టల్‌ వార్డెనే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: ధవళేశ్వరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(15) మంగళవారం రాత్రి పేలుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యమే కారణమని బాలిక తల్లి ఆరోపించారు. సకాలంలో వైద్యసేవలు అందకే తమ కుమార్తె మృతిచెందిందని బోరున విలపించారు. పేలుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న అక్కకు గింజలతో సహా కుంకుడు పులుసు, ఉప్పు నీరు వార్డెన్‌ తాగించారని మృతురాలి చెల్లి ఆరోపించింది. అంబులెన్సును పిలవలేదని, అమ్మ వచ్చిన తరువాత ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, సకాలంలో ఆస్పత్రిలో చేర్చితే అక్క బతికేదని చెప్పింది. బాలిక మృతదేహంతో హాస్టల్‌ వద్ద ధర్నా చేసేందుకు మృతురాలి తల్లి, ఎస్టీ ఎస్సీ సంఘాల నాయకులు వెళుతున్నారన్న సమాచారంతో పోలీసులు వారి ఇంటికి వెళ్లి వారించారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ అడబాల శ్రీను చెప్పారు. విద్యార్థిని మృతికి హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యం కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థినిని సకాలంలోనే వార్డెన్‌, సిబ్బంది హాస్పటల్‌కు తరలించారని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ముక్కంటి చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా వార్డెన్‌, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని