logo

మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

జిల్లాలో అగ్నికులక్షత్రియులు నివసించే వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు నిర్మించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 05 Oct 2022 06:59 IST

  కలెక్టరేట్‌ వద్ద జనసేన నిరసన

అమలాపురం పట్టణం, అల్లవరం, న్యూస్‌టుడే: జిల్లాలో అగ్నికులక్షత్రియులు నివసించే వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు నిర్మించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ డిమాండ్‌ చేశారు. అగ్నికులక్షత్రియుల జీవన భద్రత కోసం జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో అమలాపురం గడియారస్తంభం కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్‌ మాట్లాడుతూ కోనసీమ వ్యాప్తంగా అగ్నికుల క్షత్రియుల జీవనం అత్యంత దయనీయంగా మారిందని, వారి జీవన భద్రతకు మత్స్యకార గ్రామాలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.చమురు సంస్థల వల్ల సముద్రం, నదీ జలాల్లో వేట కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.10 వేలు చెల్లించాలని, డీజిల్‌ రాయితీ పెంచాలని, మత్స్యకార యువకులకు సముద్ర జలాల్లో వేటలో ఆధునిక శిక్షణ ఇవ్వాలని కోరారు. మత్స్యకారుల పిల్లలకు  ప్రత్యేక రెసిడెన్సియల్‌ పాఠశాలలు తెరవాలని, వారికి వైద్య సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు, నాయకులు, అగ్నికులక్షత్రియులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేశారు. అనంతరం  డీఆర్వో సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ మత్స్యకార అభ్యున్నతి కమిటీ ఛైర్మన్‌ బొమ్మిడి నాయకర్‌, రాజానగరం, పెద్దాపురం సమన్వయకర్తలు మేడా గురుదత్తప్రసాద్‌, తుమ్మల బాబు, మహాదశ నాగేశ్వరరావు, సందాడి శ్రీనుబాబు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని