logo

పేరు మార్చారు.. కిట్టు మరిచారు..

అప్పుడే పుట్టిన బిడ్డ ఒళ్లు ఆరగానే అమ్మ ఒడిలో స్పర్శను అనుభవించి.. హాయిగా మెత్తని వస్త్రంలో ఒదిగి నిద్రించే కానుక బేబీ కిట్టు పథకం.

Published : 28 Nov 2022 05:47 IST

బాబుతో మేరీ

న్యూస్‌టుడే, గడియార స్తంభం, అమలాపురం పట్టణం: అప్పుడే పుట్టిన బిడ్డ ఒళ్లు ఆరగానే అమ్మ ఒడిలో స్పర్శను అనుభవించి.. హాయిగా మెత్తని వస్త్రంలో ఒదిగి నిద్రించే కానుక బేబీ కిట్టు పథకం. కొన్నాళ్ల క్రితం వరకు ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన పేదింటి బిడ్డలకు అందించేవారు. కిట్టులో మొత్తటి పరుపులాంటి సంచితోపాటు పౌడర్‌ డబ్బాలు, సబ్బులు, నూనెలు, తువాళ్లు ఉండేవి. రెండేళ్లనుంచి ఈ పథకాన్ని నిలిపివేయడంతో పేదలు వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం ప్రాంతీయ, తొమ్మిది సామాజిక ఆసుపత్రులు, 46 పీహెచ్‌సీలు, ఏడు యూపీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో నెలకు సుమారు 2,600 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. గతంలో వీరికి సుమారు రూ.1,050 విలువచేసే బేబీ కిట్లు అందజేసేవారు. వాటిపై ప్రభుత్వం నెలకు రూ.2.73 లక్షలు వెచ్చించేది. వైకాపా ప్రభుత్వం కొంతకాలం వైఎస్సార్‌ పేరుతో కిట్లు అందించినా.. ప్రస్తుతం ఇవ్వడం లేదు.

రూ.800 వెచ్చించి కొన్నాం - మేరీ, అయినవిల్లి

రెండురోజుల క్రితం నాకు బాబు పుట్టాడు. ఆసుపత్రిలో బేబీ కిట్టు సరఫరా లేదని చెప్పడంతో రూ.800 తో కొన్నాం. పథకాన్ని పునరుద్ధరించాలి.

ప్రభుత్వానికి నివేదించాం.. - సీహెచ్‌ భారతిలక్ష్మి, డీఎంహెచ్‌వో

బేబీ కిట్లు అందించే పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయలేదు. మళ్లీ అందించే ఆలోచన చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో కిట్ల పంపిణీ ఆగినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో యథావిధిగా అందించేలా చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని