logo

సర్వీసింగ్‌ పేరిట రూ.1.15 లక్షలు కాజేశారు...

ఇంట్లో ఏసీ యంత్రం సర్వీసింగ్‌ చేయించేందుకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే క్రమంలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి ఆగంతకులు రూ.1.15 లక్షలు దోచుకున్న ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది.

Published : 06 Feb 2023 05:11 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఇంట్లో ఏసీ యంత్రం సర్వీసింగ్‌ చేయించేందుకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే క్రమంలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి ఆగంతకులు రూ.1.15 లక్షలు దోచుకున్న ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. సీఐ మధుబాబు వివరాల మేరకు.. మల్లయ్యపేటకు చెందిన సుంకర రామతులసిరావు పేపరు మిల్లు ఉద్యోగి. ఇంట్లో ఏసీ యంత్రం వారంటీలో ఉండడంతో దాని సర్వీసింగ్‌ నిమిత్తం గత నెల 31న ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం చూశారు. ఏసీ తయారీ సంస్థ పేరుతో కనిపించిన ఓ నంబరుకు ఫోన్‌ చేయగా అట్నుంచి ఆగంతకుడు ఓ లింక్‌ను తులసీరావు ఫోన్‌కు పంపి, అందులో వివరాలు నమోదు చేయమన్నారు. సర్వీసింగ్‌ నిమిత్తం సాధారణ ఛార్జీలుగా రెండు రూపాయల నగదును తమ ఆన్‌లైన్‌ ఖాతాలో జమచేయాలని సూచించాడు. సదరు వ్యక్తి మాయమాటలు నమ్మి రూ.2  బదిలీ చేశారు. అనంతరం ఈ నెల ఒకటో తేదీ సాయంత్రానికి తులసిరావుకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.81 వేలు, రూ.34 వేలు చొప్పున విత్‌డ్రా అయినట్లుగా ఫోన్‌కి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని