అక్షర కోయల.. అమృత కోవెల
కోయ తెగకు చెందిన గిరిజనులు... పూర్వీకుల నుంచి వస్తున్న వారి తల్లి భాషతోనే నిత్య జీవనం సాగిస్తున్నారు. వారి ప్రాంతంలో మాత్రమే తమలో తాము సంభాషించుకునేందుకు తప్ప కోయ భాషకు ప్రత్యేకించిన నిఘంటువు లేదు.
నిఘంటువు రూపొందించే క్రమంలో చర్చిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం
కోయ తెగకు చెందిన గిరిజనులు... పూర్వీకుల నుంచి వస్తున్న వారి తల్లి భాషతోనే నిత్య జీవనం సాగిస్తున్నారు. వారి ప్రాంతంలో మాత్రమే తమలో తాము సంభాషించుకునేందుకు తప్ప కోయ భాషకు ప్రత్యేకించిన నిఘంటువు లేదు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు పలువురు విద్యాభ్యాసం చేస్తున్నారు. అంతరించిపోతున్న భాషల జాబితాలో చేరుతున్న కోయ భాష పదిలంగా ఉండాలనే తపనతో కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘కోయ పద నిఘంటువు’ రూపొందిస్తున్నారు. వరాలు వారి మాటల్లో...
కోయ భాషలో ఇంతవరకు ఎలాంటి నిఘంటువు లేదు. ఎస్‌కేవీటీ కళాశాల తెలుగు విభాగం నిర్వహణలో ఈ భాషను పదిలంగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గిరిజన విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్కుగా దీనిని చేయిస్తున్నారు. ఇందులో కాల సంబంధ పదాలు, కుటుంబ బాంధవ్యాలు, పనిముట్లు, సంఖ్యలు, కట్టడాలు, భవనాలు, మొక్కలు, పొదలు, చెట్లు, పండ్లు, ఆకుకూరలు, పండుగలు, ఆభరణాలు, క్రీడలు, క్రిమికీటకాలు తదితర పదాలను సెలవుల్లో వారి గ్రామాలకు వెళ్లినపుడు విద్యార్థులు సేకరిస్తారు. ప్రస్తుతం ఆరువందల పదాల వరకు ఇలా సేకరించాం. ఇందులో 20 మంది గిరిజన విద్యార్థులు పాల్గొంటున్నారు. ‘కళాశాలలో కోయ భాషకు చెందిన విద్యార్థులు దూరప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది ఇక్కడే చదువుతున్నారు. ఈ పరిశోధనాత్మక నిఘంటువు రాబోయే తరాలకు పదిలంగా ఉంటుంది’ అని ప్రిన్సిపల్ ఎబెల్ రాజబాబు చెప్పారు.
కోయ భాషలో కొన్ని పదాలు
* దోడతిత్తినే(అన్నం తిన్నావా)
* బాత్‌కుసిరి(ఏం కూర)
* ఏరు వాట(నీరు ఇవ్వు, పెట్టు)
* మీ పెదేరు బాత(నీ పేరు ఏమిటి)
* మరం (చెట్టు) ః వీసి (ఈగ)
* కెల్లా (చెప్పు) ః వెరకాడు (పిల్లి)
* గొగ్గోడు (కోడిపుంజు)
* ఇయ్య (నాన్న)
* అవ్వ (అమ్మ)
ఆదరణ కావాలి..
మా భాషకు లిపిని కనుక్కొని అందరికీ తెలియజేయాలి. దేశంలోని ఇతర భాషలను ఏవిధంగా నేర్చుకుంటున్నారో అలాగే ఈ భాషను నేర్చుకునేందుకు ముందుకు రావాలి. మా మాతృ భాషను ఏ పాఠశాలలోను నేర్పించలేదు. మా ద్వారా కోయ భాష గొప్పతనం గురించి అందరికీ తెలిసేలా నిఘంటువు రూపొందించడం సంతోషంగా ఉంది.
రామసింధు మడకం, ఏజీ కోడేరు, చింతూరు మండలం
ప్రాముఖ్యత తెలియాలి..
మా మాతృ భాష ప్రాముఖ్యత అందరికీ తెలియాలి. ఇప్పటికే కోయ భాష కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. కళాశాల ద్వారా చేపడుతున్న ప్రయత్నంతో కొత్త ఆశలు కలిగాయి. మాకంటూ ఓ భాష ఉంది. అది ప్రపంచానికి తెలిసే విధంగా పద నిఘంటువు తయారు చేయడంలో మేమంతా పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది.
సోడే రాజు, శివకాశీపురం, జంగారెడ్డిగూడెం
విద్యార్థుల తపన చూసి...
గిరిజనేతర భాషల్లో కోయభాషకు ప్రత్యేకత ఉంది. తెలుగుశాఖ తరఫున పరిశోధనాత్మకంగా ఈ ప్రయోగాన్ని చేపట్టాం. విద్యార్థులతో పదాలను సేకరించి వాటికి తెలుగు, హిందీ, ఆంగ్లంలో అర్థాలు వచ్చేలా రూపొందిస్తున్నాం. మా కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులు వారి తల్లి భాషను కాపాడుకోవాలనే తపన చూశాక దీనిపై పరిశోధన ప్రారంభించా.
పి.వి.బి.సంజీవరావు, కళాశాల తెలుగు శాఖాధిపతి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్