logo

‘అటవీ ప్రాంత ఆక్రమణలు సహించం’

వన్యప్రాణుల వేట, అటవీ భూముల ఆక్రమణలను సహించేది లేదని జిల్లా అటవీ అధికారి ఎన్‌.రామచంద్రరావు తెలిపారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో కలిసి బొల్లాపల్లి మండలం మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే రహదారి మార్గాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం

Published : 26 Jan 2022 02:05 IST


లక్ష్మీనరసింహస్వామి ఆలయ బాటను పరిశీలిస్తున్న జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

బొల్లాపల్లి(వినుకొండ): వన్యప్రాణుల వేట, అటవీ భూముల ఆక్రమణలను సహించేది లేదని జిల్లా అటవీ అధికారి ఎన్‌.రామచంద్రరావు తెలిపారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో కలిసి బొల్లాపల్లి మండలం మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే రహదారి మార్గాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల కోటప్పకొండ వద్ద రిజర్వు ఫారెస్టు స్థలంలో రోడ్డు నిర్మించిన వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పాత ఆక్రమణలపై ఉన్న కోర్టు కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం టెరిటోరియల్‌, సామాజిక అటవీశాఖ రెండు విభాగాలు 17.50లక్షలు మొక్కలు పంపిణీ చేయడంతో పాటు మరో 150 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో మొక్కలు నాటినట్లు చెప్పారు. నేల, నీరు సంరక్షణ కింద 12 చెక్‌డ్యాంలు, 18 చిన్న ఊటకుంటలు నిర్మిస్తున్నామన్నారు. బొల్లాపల్లి రిజర్వు ఫారెస్టులో ఉన్న మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గజెట్‌లో ఎన్‌క్లోజర్‌ కింద ఉందని ఇటువంటి వాటికి వసతులు కల్పించేందుకు పెద్దగా అభ్యంతరం ఉండదన్నారు. రహదారి నిర్మాణం, కరెంట్‌ సౌకర్యం కోసం అనుమతి ఇవ్వాలని వచ్చిన అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని