logo

భవానీ... వెళ్లొస్తాం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 5 వరకూ వేడుకలు జరిగాయి. ఆరంభంలో రోజుకు 50వేల మంది వరకూ భక్తులు తరలివచ్చారు. అక్టోబరు 2న మూలా నక్షత్రం రోజున అర్థరాత్రి ఒంటిగంట నుంచి విజయ దశమి వరకూ లక్షలాదిమంది దర్శించుకున్నారు.

Published : 07 Oct 2022 06:08 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 5 వరకూ వేడుకలు జరిగాయి. ఆరంభంలో రోజుకు 50వేల మంది వరకూ భక్తులు తరలివచ్చారు. అక్టోబరు 2న మూలా నక్షత్రం రోజున అర్థరాత్రి ఒంటిగంట నుంచి విజయ దశమి వరకూ లక్షలాదిమంది దర్శించుకున్నారు. చివరి రోజు నుంచి భవానీభక్తుల రాక ఎక్కువైంది. 12లక్షల మందికి పైగా తరలివచ్చారు. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లించడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత గురు, శుక్రవారాల్లోనూ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలోనే భక్తులకు దర్శనమిస్తారు.  

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని