logo

జగనన్న కాలనీల్లో ఇళ్ల నాణ్యత పరిశీలన

జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో కేటగిరి-3లో నిర్మిస్తున్న గృహాల నాణ్యత పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాప్కాస్‌ సంస్థ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి కె.వెంకటరావును జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది.

Published : 07 Oct 2022 06:18 IST

కాలనీని పరిశీలిస్తున్న క్వాలిటీ కంట్రోల్‌ అధికారి వెంకటరావు, చిత్రంలో డీఈలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో కేటగిరి-3లో నిర్మిస్తున్న గృహాల నాణ్యత పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాప్కాస్‌ సంస్థ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి కె.వెంకటరావును జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. వెంకటరావు లాం, ఏటుకూరులోని జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణాలను గురువారం పరిశీలించారు. ఆయా గృహాల నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము, ఇసుక, సిమెంటుతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా నిర్మించిన రోడ్లు, సైడ్‌ డ్రెయిన్లు, బోర్‌వెల్స్‌ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరావు వెంట గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు సబ్‌ డివిజన్ల డీఈలు ప్రసాద్‌, ఆంజనేయులు, సత్యనారాయణ ఉన్నారు. జిల్లాలో ఆయా కాలనీల్లో కేటగిరి-3లో నిర్మిస్తున్న గృహాలను పరిశీలించి గుత్తేదారులు ఎంత వరకు నాణ్యతతో నిర్మించారు అనే వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇప్పటి వరకు నిర్మాణాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్‌ అధికారి పరిశీలన చేయనుండటంతో గుత్తేదారులు నాణ్యత, ప్రమాణాలను అనుసరించి గృహాలను నిర్మించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని