logo

శివారు భూములకు నీరందించడానికే వారబంది

పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని ప్రకాశం, పల్నాడు జిల్లాల మేజర్ల చివరి భూములకు సాగునీరు అందించేందుకు వారబందీ విధానం అమలు చేయక తప్పదని ప్రకాశం జిల్లా డీఈఈ పూర్ణచంద్‌ అన్నారు.

Published : 29 Nov 2022 04:51 IST

చర్చలు జరుపుతున్న ప్రకాశం, పల్నాడు జిల్లాల అధికారులు, రైతులు

నూజండ్ల, న్యూస్‌టుడే : పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని ప్రకాశం, పల్నాడు జిల్లాల మేజర్ల చివరి భూములకు సాగునీరు అందించేందుకు వారబందీ విధానం అమలు చేయక తప్పదని ప్రకాశం జిల్లా డీఈఈ పూర్ణచంద్‌ అన్నారు. సోమవారం మండలంలోని రవ్వారం హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద రెండు జిల్లాల అధికారులు, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల రైతులు, అధికారుల మధ్య వివాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరి ఆమోదం మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి పీబీసీకి రావాల్సిన వాటా ప్రకారం నీరు విడుదల చేయించినప్పుడే చివరి భూములకు నీరు అందుతుందని డీసీ మాజీ అధ్యక్షుడు కాకాని వీరాంజనేయులు తెలిపారు. ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయించడానికి పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తే పీబీసీకి వాటా ప్రకారం నీరు విడుదలకు ప్రకాశం జిల్లా అధికారులను ఒప్పిస్తామని వివరించారు. సమస్య తలెత్తినప్పుడు వివాదాలకు పోకుండా కూర్చుని చర్చించి పరిష్కారం చేద్దామని సూచించారు. డిసెంబరు 1 నుంచి వారబందీ అమలు చేయనున్నట్లు అందరి సమక్షంలో ప్రకటించారు. ఐదు రోజులు పల్నాడు జిల్లాకు, తర్వాత ఐదు రోజులు ప్రకాశం జిల్లా మేజర్లకు నీరు విడుదల చేసేలా ఒప్పందం చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఈలు నారాయణస్వామి, చిన్నానాయక్‌, గోపాలరావు, నాగబాబు, బ్రహ్మనాయుడు, ప్రకాశం జిల్లా నుంచి ఏఈలు ప్రసాద్‌, క్రాంతికుమార్‌, శివరామకృష్ణ, విజయరత్నం సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని