logo

కలుషిత నీటితోనే బాలికలకు అస్వస్థత

సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని గురుకులంలో కలుషిత నీటితో 206 మంది బాలికలు అస్వస్థతకు గురైనట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Published : 06 Feb 2023 05:33 IST

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని గురుకులంలో కలుషిత నీటితో 206 మంది బాలికలు అస్వస్థతకు గురైనట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరు ఎల్‌.శివశంకర్‌తో కలిసి ఆయన ఆదివారం గురుకులాన్ని పరిశీలించారు. మురుగు కాలువ పరిస్థితి, వంట గది, ఆర్వో ప్లాంటు, ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరాశాఖ విశ్లేషణలో అనేక విషయాలు వెల్లడయ్యాయన్నారు. తాగునీటికి వినియోగించే ఆర్వో ప్లాంటు నీటిలో 6.5 శాతం నుంచి 8.5 శాతం వరకు ఉండాల్సిన పీహెచ్‌ 5.9 శాతం ఉందన్నారు. ఈ నీరు సురక్షితం కాదని గుర్తించారన్నారు. ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు చేశారన్నారు. కలెక్టరు మాట్లాడుతూ ఆహారంతో బాలికలకు అస్వస్థత కలగలేదన్నారు. పాత్రలు కడిగే చోట, మరుగుదొడ్ల వద్ద నీటిలో ఈకోలి అనే బ్యాక్టీరియా ఉందన్నారు. చెరువు నీటిలో క్యాప్‌సెల్‌ బ్యాక్టీరియాను గుర్తించారన్నారు. చెరువు నీటిని వినియోగించరాదని ప్రిన్సిపల్‌ స్వర్ణకుమారికి సూచించామన్నారు. డ్రైనేజీ సమస్య వారం రోజుల్లో పరిష్కారమవుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని