logo

రాష్ట్రంలో అధ్వాన స్థితిలో నీటిపారుదల ప్రాజెక్టులు

ఆంధ్ర రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు అధ్వాన స్థితిలో ఉన్నాయని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు.

Published : 22 Mar 2023 05:26 IST

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

లక్ష్మణరెడ్డి

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: ఆంధ్ర రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు అధ్వాన స్థితిలో ఉన్నాయని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరు రామన్నపేటలోని జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం ఐదు శాతం నిధులే కేటాయించడం అన్యాయమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని, కేటాయింపులు ఇలా ఉంటే.. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 30 సంవత్సరాలు పడుతుందన్నారు. 2023, సెప్టెంబర్‌ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారని, ఆచరణలో మాత్రం ఆ స్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు లేవన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అంతేకాకుండా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాలకు తాగునీరు లభిస్తుందన్నారు. ఏపీ అభివృద్ధి అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తాగునీటి పారుదల ప్రాజెక్టుల పురోగతి, వెలిగొండ ప్రాజెక్టుపై ఈ నెల 29న ఒంగోలులో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు ఏపీసీసీ మీడియా రాష్ట్ర ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి వక్తగా పాల్గొంటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని