logo

ఐఎఫ్‌ఎస్‌కు నడింపల్లి యువతి ఎంపిక

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్‌ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

Published : 10 May 2024 05:22 IST

తండ్రి లేకున్నా తల్లి అండతో లక్ష్యం వైపు అడుగులు

నడింపల్లి (చెరుకుపల్లి గ్రామీణ): ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్‌ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తన జీవిత గమ్యం చేరుకోవడంలో అడుగడుగునా అవరోధాలు ఎదురైనా వాటిని ధైర్యంతో అధిగమించారు. ఇంటర్‌ చదివే సమయంలో కొండంత అండగా నిలవాల్సిన తండ్రి అకాల మరణం ఆమెను కుంగదీసింది. సాయం కోసం వెళ్లిన చోట ఓ అధికారి చెప్పిన మాటలే స్ఫూర్తిగా ఈ విజయాన్ని సాధించానని ఆమె తెలిపారు. 2018లో మొదటిసారి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుని సివిల్స్‌కు సన్నద్ధమైంది. తరువాత రెండేళ్లు ప్రైవేటు ఉద్యోగం చేసింది. తిరిగి ఉద్యోగం వదిలి పూర్తిగా సివిల్స్‌పై దృష్టిపెట్టింది. 2018లో ప్రిలిమ్స్‌ పూర్తి చేసి మెయిన్స్‌లో 20 మార్కుల దూరంలో ఆగిపోయింది. 2019లో ఇంటర్వ్యూలో ఒక్క మార్కుతో సివిల్స్‌ దూరమైంది. 2021, 2022లో ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్‌లో వెనుతిరిగింది. తల్లి ఇందిర, స్నేహితులు, సోదరి సౌమ్య సహకారంతో మళ్లీ పుంజుకుంది. పూర్తి సన్నద్ధతతో 2023లో పరీక్ష రాయగా, బుధవారం వెలువడిన ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా 73వ ర్యాంక్‌తో సత్తా చాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని