logo

పేరుకే ఏసీ బస్‌ షెల్టర్‌

ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏసీ బస్‌ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. గ్రేటర్‌లోని ప్రధాన మార్గాల్లో గతంలో బల్దియా, ప్రైవేటు ఏజెన్సీల సహకారంతో వీటిని ప్రారంభించారు.

Updated : 27 Mar 2024 04:08 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏసీ బస్‌ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. గ్రేటర్‌లోని ప్రధాన మార్గాల్లో గతంలో బల్దియా, ప్రైవేటు ఏజెన్సీల సహకారంతో వీటిని ప్రారంభించారు. రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు పెరగనున్న నేపథ్యంలో ఏసీ బస్‌ షెల్టర్లు అందుబాటులోకి తేవావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

అన్ని హంగులతో: హైటెక్‌ సిటీ, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌, ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, ఎస్పీ రోడ్డు, సోమాజీగూడ, తార్నక, దిల్‌సుఖ్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో గత ప్రభుత్వం 2018లో ఏసీ షెల్టర్లను ప్రారంభించింది. కొన్ని రోజులకే ఏసీలు పాడయ్యాయి. అనంతరం వాటిని పట్టించుకునేవారు లేకపోవడంతో వివిధ ప్రాంతాల షెల్టర్లలోని సీసీ కెమెరాలు, ఏసీలు చోరీకి గురయ్యాయి. కొన్ని బస్‌ షెల్టర్లను టిఫిన్‌ సెంటర్లుగా వాడుకుంటున్నారు.

  • దిల్‌సుఖ్‌నగర్‌ వద్దనున్న షెల్టర్లలో ఏసీలు పాడయ్యాయి. ఫలితంగా ప్రయాణికులు రహదారిపై ఉంటున్నారు. వీటిలో పైవేటు వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేయడంతో బస్సులు వస్తే ప్రయాణికులు గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
  • తార్నాకలోని ఏసీ బస్‌ షెల్టర్లలోని టాయిలెట్స్‌ శిథిలమై నిరుపయోగంగా మారాయి. అపరిశుభ్ర వాతావరణం కారణంగా ప్రయాణికులు లోపలికి వెళ్లడం లేదు.
  • సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాల సమీపంలోని బస్‌బే వద్ద బస్సులు ఆగకపోవడంతో అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. వీటిలోని పరికరాలు సైతం నిరుపయోగంగా మారాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని