logo

తహసీల్దార్‌గా బాధ్యతల స్వీకరణ

సుల్తానాబాద్‌ మండల తహసీల్దార్‌గా బి.యాకన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ పాల్‌సింగ్‌ జనగామ జిల్లాకు బదిలీ కాగా వరంగల్‌ జిల్లానుంచి యాకన్న ఇక్కడకు వచ్చారు

Published : 18 Jan 2022 02:34 IST

తహసీల్దార్‌ యాకన్నతో ప్రజాప్రతినిధులు

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: సుల్తానాబాద్‌ మండల తహసీల్దార్‌గా బి.యాకన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ పాల్‌సింగ్‌ జనగామ జిల్లాకు బదిలీ కాగా వరంగల్‌ జిల్లానుంచి యాకన్న ఇక్కడకు వచ్చారు. ఆయనకు ఎంపీపీ బాలాజీరావు, నాయకులు మహిపాల్‌రెడ్డి, ఫకీర్‌యాదవ్‌, విజేందర్‌, శంకర్‌, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

నాయబ్‌ తహసీల్దార్లుగా...

ముత్తారం: ముత్తారం మండల తహసీల్‌ కార్యాలయంలో నాయబ్‌ తహసీల్దార్‌గా ఉదయ్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జోనల్‌ బదిలీల్లో భాగంగా ఇక్కడి నాయబ్‌ తహసీల్దార్‌ బొబ్బిలి సత్యనారయణ సిరిసిల్ల జోన్‌కు బదిలీ అయిన విషయం విధితమే. కాళేశ్వరం జోన్‌ ఉమ్మడి వరంగల్‌ నుంచి ఉదయ్‌కుమార్‌ ముత్తారానికి వచ్చారు. విధులో చేరిన ఉదయ్‌కుమార్‌ను రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

మంథని గ్రామీణం: మంథని నాయబ్‌ తహసీల్దార్‌గా సిరిపురం గిరి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. తహసీల్దార్‌ బండి ప్రకాష్‌ నాయబ ్‌తహసీల్దార్‌కు పదవీ బాధ్యతలను అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని