logo

తమ్ముడి ఆత్మహత్యకు కారణమైన అన్న అరెస్టు

ఆస్తి విషయంలో సొంత అన్న తనను మోసం చేశాడని పేర్కొంటూ తిరమల్‌నగర్‌కు చెందిన తిప్పారపు శ్రీనివాస్‌ సెల్ఫీ వీడియో ద్వారా వివరాలు వెల్ల్లడించి ఆత్మహత్య

Published : 22 Jan 2022 02:22 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆస్తి విషయంలో సొంత అన్న తనను మోసం చేశాడని పేర్కొంటూ తిరమల్‌నగర్‌కు చెందిన తిప్పారపు శ్రీనివాస్‌ సెల్ఫీ వీడియో ద్వారా వివరాలు వెల్ల్లడించి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పొత్తులో నిర్మించుకున్న ఇంటిలో అన్న ఆంజనేయులు, తమ్ముడు శ్రీనివాస్‌ను రానివ్వలేదని, అక్క, అన్నతో కలిసి కొనుగోలు చేసిన భూమి విషయంలో సైతం వారిద్దరు తనను మోసం చేశారని శ్రీనివాస్‌ వివరించారు. పెట్టుబడి పెట్టిన డబ్బును సైతం తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని పేర్కొంటూ శ్రీనివాస్‌ తన బాధను చరవాణిలో రికార్డు చేసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం శ్రీనివాస్‌ మృతికి కారణంగా పేర్కొన్న అతని అన్న ఆంజనేయులుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని