logo

రాత్రి విధుల మినహాయింపు

రాత్రి ఎనిమిది గంటలలోపు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు ముగించుకునేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చేసిన ఉత్తర్వు మహిళా కండక్టర్లకు వరంగా మారాయి. ఇది సీఎం హామీ మేరకు అమలవుతున్నా, ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడంతో

Published : 27 Jan 2022 04:49 IST

మహిళా కండక్టర్లకు సౌకర్యం..


టికెట్లు అందజేస్తున్న మహిళా కండక్టర్‌

ధర్మపురి, న్యూస్‌టుడే: రాత్రి ఎనిమిది గంటలలోపు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు ముగించుకునేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చేసిన ఉత్తర్వు మహిళా కండక్టర్లకు వరంగా మారాయి. ఇది సీఎం హామీ మేరకు అమలవుతున్నా, ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వారం రోజులుగా పూర్తి స్థాయిలో అమలవుతోంది. రాత్రిళ్లు విధుల్లో పాల్గొంటున్న మహిళా కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారికి వరంగా మారాయి. గతంలో ఆర్టీసీ కార్మికులతో సీఎం చర్చించిన సందర్భంలోనే దీనికి కార్మిక సంఘాలు దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి మహిళా ఉద్యోగి రాత్రి 8 గంటలలోపు పనులు పూర్తి చేసుకుని విధులను ముగిస్తున్నారు. గతంలో మహిళా కండక్టర్ల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎదురుచూసే వారు. అర్ధరాత్రి, విధులు చేయడం ఎంతో అసౌకర్యంగా ఉండేది. ప్రస్తుతం రాత్రి 8 లోపే మహిళలు తమ ఇంటికి చేరే అవకాశం రావడంతో ఎంతో వరంగా మారింది. జగిత్యాల డీఎం జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. ఈ విధానం చాలా రోజులుగా అమలవుతున్నా, తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం.


ఎంతో సౌకర్యంగా ఉంటోంది
- కొనపర్తి లక్ష్మి(కండక్టర్‌)

23 ఏళ్లుగా ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. అయితే రాత్రి 9 దాటిందంటే ఎంతో అసౌకర్యంగా ఉండేది. ఇంటి పనులు, కుటుంబ బాధ్యత జ్ఞాపకం వచ్చేవి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేయడంతో రాత్రి 8.30 వరకు విధులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుతున్నాం. ఎంతో సౌకర్యంగా ఉంటోంది. మహిళ ఉద్యోగులకు మరిన్ని వసతులు కల్పించాలి.


మహిళలకు వరమే
- కొండ్ర స్రవంతి (కండక్టర్‌ )

ఇప్పటి వరకు రాత్రి దూర ప్రయాణాల విధులు మహిళ ఉద్యోగులకు ఇబ్బందే. మాది సొంత గ్రామం గొల్లపల్లి. విధులు పూర్తి చేసుకుని ఇంటికి చేరే సరికి చాలా ఆలస్యమయ్యేది. ఇంటి పనులు పిల్లల సంరక్షణ ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం రాత్రి 8 గంటల వరకు విధులు పూర్తి చేసుకుని, 8.30 వరకే ఇంటికి చేరుతున్నాం. మహిళలకు వరంగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని