logo

సైబర్‌ నేరగాళ్ల వలలో పడొద్దు

సైబర్‌ నేరగాళ్ల వలలో పడవద్దని జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించవద్దని అనుమానాస్పదంగా వచ్చే లింక్స్‌ను క్లిక్‌ చేయవద్దని పేర్కొన్నారు.

Published : 24 May 2022 05:32 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్ల వలలో పడవద్దని జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించవద్దని అనుమానాస్పదంగా వచ్చే లింక్స్‌ను క్లిక్‌ చేయవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల వలలో పడి మోసపోతే వెంటనే 100 లేదా 1930 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే పొగొట్టుకున్న నగదును తిరిగిపొందే అవకాశముంటుందని పేర్కొన్నారు. తక్కువ వడ్డీకి రుణాలిస్తామని ఫోన్‌ చేసినా, సందేశం వచ్చినా నమ్మి రుణాలు తీసుకోవద్దని, బ్యాంకు వినియోగదారుల సెల్‌ఫోన్లకు వచ్చే ఓటీపీ నెంబర్లను అపరిచితుల వ్యక్తులతో పంచుకోరాదని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌లో సంప్రదించరని అపరిచితుల వ్యక్తులు ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం అడిగితే చెప్పవద్దన్నారు. వెబ్‌సైట్‌లో అమ్మే వస్తువులు వ్యక్తులను చూడకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగాలిస్తామంటూ వచ్చే ప్రకటనలకు స్పందించవద్దన్నారు. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లింక్‌ చేయాలంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దన్నారు. మోసాలపై తక్షణమే ఫిర్యాదు చేస్తే నష్టపోకుండా చూడవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని