logo

సాధారణ ప్రసవాల సంఖ్య పెంపునకు ఆదేశం

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యతో పాటు ఓపీ సేవలను పెంచాలని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుమన్‌మోహన్‌రావు

Published : 26 May 2022 04:07 IST

మాట్లాడుతున్న ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు శ్రీనివాస్‌రావు

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యతో పాటు ఓపీ సేవలను పెంచాలని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుమన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ఆరోగ్యశ్రీ పోర్టల్‌ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సేవలు అందించాలన్నారు. పెద్ద ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యులకు సూచించారు. ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ గురించి వైద్యాధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, వ్యాధి నిరోధక టీకాలు, టీబీ, సంక్రమిత వ్యాధులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్లు బాలాజిరెడ్డి, విజయ్‌కుమార్‌, శ్రీకృష్ణ, వైద్యాధికారులు శ్రీరాములు, మహేష్‌, రజిత, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని