logo

నగరం క్రీడలకు వేదిక

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతూ క్రీడల వేదికగా రూపొందుతుందని జల్లా కలెక్టర్‌ ఆర్‌.వి కర్ణన్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్, క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన ఒలింపిక్‌ డే రన్‌ను

Published : 24 Jun 2022 04:25 IST

జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌

ఒలింపిక్‌ రన్‌లో జిల్లా కలెక్టర్, మేయర్, అతిథులు, క్రీడాకారులు

కరీంనగర్‌ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతూ క్రీడల వేదికగా రూపొందుతుందని జల్లా కలెక్టర్‌ ఆర్‌.వి కర్ణన్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్, క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన ఒలింపిక్‌ డే రన్‌ను కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ త్వరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి రానుందన్నారు. అంబేడ్కర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ కోర్టు, క్రీడలకు సంబంధించిన శిక్షణ సదుపాయాలు స్మార్ట్‌సిటీతో మెరుగయ్యాయన్నారు. మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ.. కరీంనగర్‌ను అన్ని రంగాలతోపాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఒలింపిక్‌ డే రన్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో ప్రారంభమై.. ధోబీవాడ చౌరస్తా, బస్టాండ్, కలెక్టరేట్‌ చౌరస్తా, కలెక్టరేట్, భగత్‌నగర్‌ చౌరస్తా మీదుగా తిరిగి అంబేడ్కర్‌ స్టేడియానికి చేరుకుంది. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి కె.రాజవీరు, బేస్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సీఐ నటేష్, అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు తుమ్మల రమేష్‌రెడ్డి, సీఏ నిరంజనాచారి, కోశాధికారి ఎన్‌.సిద్ధారెడ్డి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సమ్మయ్య, అంతర్జాతీయ పారా అథ్లెట్‌ అంజనారెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు సారయ్య, శంకరయ్య, కడారి రవి, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని