logo

సమరయోధుల త్యాగాలు భావి తరాలకు చెప్పాలి

స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను భావి తరాలకు చాటిచెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం

Published : 11 Aug 2022 06:28 IST


సినిమా వీక్షిస్తున్న మంత్రి కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మేయర్‌ సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను భావి తరాలకు చాటిచెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి స్థానిక ప్రతిమ మల్టీప్లెక్స్‌లో బుధవారం గాంధీ చలన చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంచేందుకు ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు మొక్కలను నాటడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలను ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. దేశ చరిత్రను వక్రీకరించేందుకు నేటి పాలకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూను కించపర్చేలా పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలతో దేశం గొప్పగా అభివృద్ధి సాధిస్తుంటే వాటిని నేడు అమ్ముతుండటం దేశ పురోగతికి గొడ్డలిపెట్టని తెలిపారు. గత చరిత్రను నేటి తరం తెలుసుకునేలా 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటిని దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, జిల్లా సీపీ వి.సత్యనారాయణ, అదనపు పాలనాధికారి గరిమాఅగ్రవాల్‌, డిప్యూటీ మేయర్‌ సి.హెచ్‌.స్వరూపరాణి, నగర పాలక కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని