logo

మానవాళి మనుగడకు చెట్లే ఆధారం

మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరు ప్రకృతిని ప్రేమించి, రక్షిద్దామని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి, ఎస్పీ సింధు శర్మ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో

Published : 13 Aug 2022 04:07 IST

చెట్టుకు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రవి,

జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఎస్పీ సింధుశర్మ, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రావు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరు ప్రకృతిని ప్రేమించి, రక్షిద్దామని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి, ఎస్పీ సింధు శర్మ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిసారిగా ‘వృక్షాబంధన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సమావేశంలో సీఎం సారంగాపూర్‌ మండలంలోని రేచపల్లి అడవులు నరికివేతకు గురవుతున్నాయంటూ ఆరాతీస్తుంటారని, అలా కాదని చూపించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో జిల్లాలో 8 విడతలుగా 7.50 కోట్ల మొక్కలను నాటామని, దీనివల్ల 7.8 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టి చెట్టుకు ఉన్న ప్రాధాన్యత, అనుబంధాన్ని డీఎఫ్‌వో బి.వెంకటేశ్వర్‌ వివరించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మీనారాయణ, అదనపు పీడీ సుధీర్‌, ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సొల్లు సురేందర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌రావు, ఎంపీడీవో వెంకటేశ్‌, రేంజర్‌ ప్రణీత్‌కౌర్‌, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని